Top 5 This Week

Related Posts

భూదాన్ భూముల కేసులో మరో నలుగురు కీలక నిందితుల అరెస్ట్

ఖమ్మం: వివాదాస్పద వెలుగుమట్ల భూదాన్ భూముల దురాక్రమణ కేసులో మరో నలుగురు కీలక నిందితులను అరెస్ట్ చేసినట్లు ఖమ్మం సిటీ ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ఖమ్మం అర్బన్ మండల పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలోని భూదాన్, ప్రభుత్వ భూములపై అక్రమ వ్యాపారాలకు, ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రైం నెం. 101/2026 ద్వారా బీఎన్ఎస్ చట్టంలోని 111 (1) (ii), 318(4) రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద గతంలో ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామన్నారు.

ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేయగా, సోమవారం మరో నలుగురు కీలక నిందితులైన కల్తీ రామచంద్రయ్య, బాణాల లక్ష్మణాచారి, చిప్పనపల్లి వీరయ్య, కుంజా కృష్ణయ్యలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుందని కూడా ఆయన పేర్కొన్నారు.

కాగా ఈ కేసులో ప్రధాన నిందుతులైన పోలెబోయిన ముత్తయ్య, బల్లి శ్రీనివాస్, కొప్పెర వెంకన్న, కొట్టే బసు, సంపంగి వెంకటాచలం అనే వ్యక్తులను మేజిస్ట్రేట్ అనుమతితో పోలీస్ కస్టడీకి తీసుకున్నట్లు చెప్పారు. ఆయా వ్యక్తులను విచారించిన అనంతరం సోమవారం తిరిగి జ్యుడీషియల్ రిమాండుకు తరలించినట్లు చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు పదహారు మంది నిందితులను అరెస్ట్ చేయగా, నిందితుల అక్రమ అస్తులను గుర్తించి వాటిని చట్ట ప్రకారంగా స్వాధీనం పర్చుకునే ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఏసీపీ రమణమూర్తి వివరించారు.

Popular Articles