Top 5 This Week

Related Posts

ఖమ్మం జిల్లా పోలీసులకు డీజీపీ ప్రశంస

ఖమ్మం: ఖమ్మం జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని డీజీపీ సీవీ ఆనంద్ ప్రశంసించారు. మాదక ద్రవ్యాల నిరోధం, ముఖ్యంగా గంజాయి అక్రమ రవాణా, సైబర్ క్రైం నేరాల దర్యాప్తులో ఖమ్మం పోలీసుల పనితీరుకు డీజీపీ కితాబునిచ్చారు. ఈమేరకు డీజీపీ మంగళవారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు.

అయితే వివిధ కేసుల్లో నేరస్థులకు శిక్షలు తగ్గిపోయాయని ఆయన అన్నారు. ఇటువంటి కేసుల్లో నిందితులకు శిక్షలు పడే విధంగా మేజిస్ట్రేట్లతో పోలీసు అధికారులు సత్సంబంధాలు ఏర్పరచుకుని, సరైన సాక్ష్యాధారాలు సమర్పించాలని, కోర్టుకు హాజరు కావాలని డీజీపీ సూచించారు. ఆకస్మిక తనిఖీలు, రాత్రి, పగటి గస్తీ వంటి అంశాల్లోనూ ఖమ్మం పోలీసుల తీరు భేషుగ్గా ఉందన్నారు. మొత్తంగా అనేక అంశాల్లో ఖమ్మం పోలీసు తీరు ముందంజలోనే ఉందని డీజీపీ సీవీ ఆనంద్ ప్రశంసించారు.

కాగా సోషల్ మీడియాలో వైషమ్యలాను సృష్టిస్తున్నవారిని కూడా ఖమ్మంలో గుర్తించామన్నారు. సమాజంలో రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించి, వాళ్ల పని చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో, వారిపై నిఘా పెట్టి నలుగురైదుగురిని గుర్తించామని, వారిపై చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తదితరులు పాల్గొన్నారు.

Popular Articles