Top 5 This Week

Related Posts

కాంగ్రెస్ లో పెద్దపల్లి ఎంపీ ‘వ్యంగ్య’ లేఖ కలకలం

పెద్దపల్లి: పెద్దపల్లి ఎంపీ, మంత్రి వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు రాసిన ఓ ‘వ్యంగ్య’ లేఖ తెలంగాణా అధికార పార్టీలో కలకలం కలిగిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్ బాబుల మధ్య కొనసాగుతున్న విభేదాల రాజకీయాలకు ఈ లేఖ ప్రబల నిదర్శనంగా రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ ఈ లేఖలో ఎంపీ వంశీకృష్ణ వ్యంగ్యంగా ఏమంటున్నారంటే..

  • రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే సంకల్పంతో ఢిల్లీ రాంలీలా మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు గైర్హాజరైన పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు విజయ రమణారావుపై, మక్కాన్ సింగ్ పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని వంశీకృష్ణ అంటున్నారు!
  • ఢిల్లీ కార్యక్రమానికి రాకుండా మంథనిలో శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీని ఆహ్వానించి, రూ. 3.00 కోట్లకు పైగా వెచ్చించి నిర్వహించిన ప్రైవేట్ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైన ఆయా ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవద్దనేది వంశీకృష్ణ లేఖలోని సారాంశం.
  • కానీ తమ కాకా వెంకటస్వామి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్యూల్ బ్యాగులు పంపిణీ చేసినటువంటి కార్యక్రమానికి హాజరైన మహిళా ప్రజాప్రతినిధి సహా కాంగ్రెస్ కార్యకర్తలను మరుసటిరోజే కనీసం షోకాజ్ నోటీసు కూడా జారీ చేయకుండా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం విచారకరమని ఎంపీ వంశీకృష్ణ పేర్కొనడం గమనార్హం.
  • సహజ న్యాయ సూత్రాలకు కట్టుబడి ఢిల్లీ సభకు హాజరుకానంత మాత్రాన ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్, విజయరమణారావులకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వకుండా వారిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసకోవద్దని, వారిని సస్పెన్షన్ నుంచి మినహాయించాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మంత్రి శ్రీధర్ బాబును కోరారు.
  • ఇటువంటి వ్యంగ్య వాఖ్యలతో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మంత్రి శ్రీధర్ బాబుకు రాసిన లేఖ ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఆయా లేఖలోని పూర్తి అంశాలను దిగువన గల ప్రతిలో చదవవచ్చు..

Popular Articles