పాలేరు: తెలంగాణా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు. కూసుమంచి మండలం గంగబండ తండాలో, ఏదులాపురం మున్సిపాలిటీలో, తిరుమలాయపాలెం మండలంలో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
- కూసుమంచి మండలం గంగబండ తండా వద్ద రూ. 45.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
- ఏదులాపురం మునిసిపాలిటీ 14,15,16 వార్డులైన తెల్దార్ పల్లిలో రూ. 312.90 లక్షలతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
- విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగ విరమణ చేసిన గడ్డికొప్పుల రాములు ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొన్నారు.
- తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ, కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
- అదేవిధంగా దమ్మాయిగూడెం గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను 187 మందికి అందజేశారు.
ఆయా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత తదితరులు పాల్గొన్నారు.

