Top 5 This Week

Related Posts

వరద విపత్తుపై మంత్రి పొంగులేటి సమీక్ష

సత్తుపల్లి: మురసు తుపాన్ పరిణామాల్లో ఏర్పడిన వరద విపత్తుపై తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం సమీక్షించారు. ఈమేరకు సత్తుపల్లిలోని సింగరేణి కాలరీస్ గెస్ట్ హౌజ్ లో బేతుపల్లి వరద సహాయక చర్యలు, వరద ముంపు నష్టాలపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, సత్తుపల్లి, అశ్వరావుపేట ఎమ్మెల్యేలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

అధికారులు సమన్వయంతో తీసుకున్న చర్యలు, ప్రాణనష్టం లేకుండా చేపట్టిన చర్యలను ఆయన అభినందించారు. అదేవిధంగా బేతుపల్లి చెరువు ప్రాంతంతో పాటు పలు గ్రామాలకు వరద ముప్పు ఏర్పడిన సమయంలో ఎస్డీఆర్ఎఫ్‌ సిబ్బంది తక్షణమే స్పందించి చేపట్టిన సహాయక చర్యలను కూడా ప్రశించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఉమ్మడి జిల్లా వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Popular Articles