Top 5 This Week

Related Posts

‘పత్తాలాట’ నిర్వాహకులతో ఎస్ఐ మిలాఖత్, సస్పెన్షన్

ఖమ్మం: జూదం స్థావరాల నిర్వాహకులతో కుమ్ముక్కయ్యాడనే అభియోగాలపై ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేస్తూ డీఐజీ ఆఫీసు ద్వారా ఉత్తర్వు జారీ అయినట్లు సమాచారం. ఈమేరకు టాస్క్ ఫోర్స్ విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్న సురేష్ అనే పోలీసు అధికారి సస్పెన్షన్ కు గురయ్యారు.

వాస్తవానికి ఎస్ఐ సురేష్ పై వచ్చిన ఆయా అభియోగాల మేరకు ఇటీవలే అతన్ని సీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఎస్ఐ సురేష్ జూద నిర్వాహకులతో మిలాఖత్ అయ్యారనే ఆరోపణలపై ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత సమగ్ర విచారణ చేసి నివేదికను పంపిస్తూ, చర్య కోసం డీఐజీకి సిఫారసు చేసినట్లు సమాచారం.

దీంతో ఎస్ఐ సురేష్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ డీఐజీ ఆఫీసు నుంచి ఉత్తర్వులు వెలువడినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిలువరించాల్సిన బాధ్యతల్లో గల ఎస్ఐ సురేష్ జూద నిర్వాహకులతోనే కుమ్ముక్కై సస్పెన్షన్ కు గురి కావడం ఖమ్మం జిల్లా పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

Popular Articles