Top 5 This Week

Related Posts

‘సమీక్ష’ ఎఫెక్ట్: సీతారామ కెనాల్ పనుల ‘నాణ్యత’కు రిపేర్లు

ఖమ్మం: నిర్మించిన ఏడాదికే ధ్వంసమైన సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ సీసీ లైనింగ్ పనులకు రిపేర్లు మొదలయ్యాయి. ఖమ్మం జిల్లా ఏన్కూరు వద్ద సుమారు రూ. 72 కోట్లతో చేపట్టి నిర్మించిన సీతారామ ప్రాజెక్ట్ లింక్ కెనాల్ సీసీ లైనింగ్ పనుల నాణ్యతను ‘సమీక్ష’ న్యూస్ నిన్న వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 25-30 ఏళ్లపాటు మన్నికతో ఉండాల్సిన పనులు అప్పుడే పగిలిపోయిన వైనాన్ని ఫొటోలతో కళ్లకు కట్టినట్లు ‘సమీక్ష’ వెబ్ సైట్ నిన్న వార్తా కథనాన్ని ప్రచురించింది.

మరమ్మత్తు పనుల్లో భాగంగా ధ్వంసమైన సీసీ లైనింగ్ ను తొలగించి జేసీబీతో చదును చేస్తున్న దృశ్యం

దీంతో అధికారుల ఆదేశమో, లేక పాలకుల కనుసైగో తెలియదుగానీ కాల్వకు మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి. అయితే నాణ్యత లేకుండా చేపట్టిన కోట్లాది రూపాయల పనుల నాణ్యతపై అధికారికంగా ఎటువంటి విచారణ లేకుండానే రిపేర్లు చేస్తుండడంపై పలు ప్రశ్నలు కూడా రేకెత్తుతున్నాయి. ఓ కేబినెట్ మంత్రితో, సీఎంకు అత్యంత సన్నిహితుడైన నాయకుడితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు ప్రాచుర్యంలో గల ఈ బడా కాంట్రాక్టర్ చేపట్టిన కెనాల్ పనుల నాణ్యతపై నెలకొన్న సందేహాలు మాత్రం తీరలేదనే చర్చ ప్రజల్లో జరుగుతోంది.

ధ్వంసమైన ప్రదేశంలో తిరిగి సీసీ లైనింగ్ వేసిన దృశ్యం

Popular Articles