హైదరాబాద్: పీసీఎస్ (పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్) విభాగంలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డి ఆస్తుల చిట్టాను ఏసీబీ గురువారం రాత్రి ప్రకటించింది. ఈ ఉదయం నుంచి ఆయన నివాసం సహా 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అనంతరం గుర్తించిన ఆస్తుల వివరాలను వెల్లడించింది. సోదాల అనంతరం ఏసీబీ ప్రకటించిన ఆస్తుల వివరాలు:
- హైదరాబాద్ ఇబ్రహీంబాగ్ లోని వెసెల్లా మెడోస్ లో ఒక విల్లా.
- టెలికాం నగర్ లో జీ+2 పెంట్ హౌజ్ నివాస గృహం.
- టెలికాం నగర్ లోని సాయి ప్రభ రెసిడెన్సీలో ఒక ఫ్లాట్.
- గచ్చిబౌలిలోని క్రాంతి సియోన్ అపార్ట్మెంట్ లో ఓ ఫ్లాట్.
- మణికొండలోని లాంకోహిల్స్ లో 500 చదరపు గజాల వైశాల్యంలో గల జీ+5 కమర్షియల్ కాంప్లెక్స్ లో భాగస్వామ్యం.
- మణికొండలోని మర్రిచెట్టు జంక్షన్లో 3,000 చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్.
- తెల్లాపూర్ లోని అభినందన రెసిడెన్సీలో రెండు నివాస ఫ్లాట్లు.
- ప్రగతి రిసార్ట్స్ లో 500 చదరపు గజాల ఓపెన్ ప్లాట్.
- సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి.
- కర్నాటకలో ఆరు ఎకరాల వ్యవసాయ భూమి.
- కర్నాటకలోనే మరో 38 ఎకరాల వ్యవసాయ భూమి.
- బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఎకరం భూమి.
- నాగోల్ లోని కామినేని హాస్పిటల్ వద్ద 200 చదరపు గజాల ఓపెన్ ప్లాట్.
- జీపీఆర్ హౌజింగ్ సొసైటీలో 400 చదరపు గజాల ఓపెన్ ప్లాట్.
- పటాన్ చెరు వద్ద 200 చదరపు గజాల ఓపెన్ ప్లాట్.
- వికారాబాద్ మోమిన్ పేట వద్ద వెయ్యి చదరపు గజాల స్థలం.
- వికారాబాద్ మోమిన్ పేటలోనే రెండు ఎకరాల వ్యవసాయ భూమి.
- రాఘవేంద్ర రాక్ శాండ్ మినరల్స్ సంస్థలో రూ. 75.00 లక్షల పెట్టుబడి.
- ముచ్చింతల్ లో 4.20 ఎకరాల వ్యవసాయ భూమి.
ఇవిగాక భీంరెడ్డి నివాసంలో రూ. 3.60 లక్షల నగదు, అతని బినామీ నివాసంలో మరో రూ. 40.00 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రెండు కిలోల బంగారం, 20 కిలోల వెండి, మరో రూ. 19.91 లక్షల బ్యాంక్ బ్యాలెన్సులు ఉన్నట్లు గుర్తించారు. డీఎస్పీ నివాసంలో 23 ఫారిన్ లిక్కర్ బాటిళ్లను కూడా ఏసీబీ గుర్తించింది. బహిరంగ మార్కెట్ లో భీంరెడ్డి ఆస్తుల విలువ మరింతగా ఉంటుందని ఏసీబీ ప్రకటించింది.
కాగా భీంరెడ్డి ఆస్తులకు సంబంధించి ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఈ రాత్రికి డీఎస్పీని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని, ఆ తర్వాత అతన్ని కోర్టులో హాజరుపర్చనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

