Top 5 This Week

Related Posts

Ebola: హైదరాబాద్ లో మరో అనుమానిత కేసు

హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో మరో ఎబోలా అనుమానిత కేసు వెలుగు చూసింది. దీంతో రాష్ట్ర రాజధానిలో ఎబోలా అనుమానిత కేసుల సంఖ్య రెండుకు చేరింది. అయితే ఈ రెండు అనుమానిత కేసుల్లోనూ ఇద్దరు వ్యక్తులు సూడాన్ దేశానికి చెందినవారే కావడం గమనార్హం. తాజాగా నగరంలోని ఓ ఇనిస్టిట్యూట్ లో చదువుకుంటున్న సూడాన్ కు చెందిన మహ్మద్ యగౌచ్ అహ్మద్ అనే వ్యక్తి ఎబోలా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అంతకు ముందు అంటే.. నిన్న అహ్మద్ అనే వ్యక్తికి ఎబోలా హిస్టరీ ఉన్నట్లు శంషాబాద్ ఎయిర్ పోర్టు స్క్రీనింగ్ టెస్టులో వెలుగు చూసిన విషయం విదితమే. ఇతను సూడాన్ నుంచి ఎయిర్ పోర్టులో దిగిన నేపథ్యంలో జరిపిన టెస్టులో ఎబోలా హిస్టరీ బహిర్గతమైంది. దీంతో అహ్మద్ ను ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలోని ఐసొలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Popular Articles