Top 5 This Week

Related Posts

గోచి కట్టుకున్నోళ్లంత వైఎస్ అయితే బానే ఉండు: సీఎం రేవంత్ సెటైర్లు ఎవరిపై!?

మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సెటైర్ వ్యాఖ్యలు రాజకీయ చర్చనీయాంశంగా మారాయి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఒకాయన గోషీ కట్టుకుని రాజశేఖర్ రెడ్డి అనుకుంటడు గట్లెంబడి తిరిగి.. గోచి కట్టుకున్నోళ్లంత రాజశేఖర్ రెడ్డి అయితే బానే ఉండు..’ అని ముఖ్యమంత్రి పాలమూరు జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.

ఎవరిని ఉద్ధేశించి సీఎం రేవంత్ ఈ సెటైర్లు విసిరారనే అంశంపై సోషల్ మీడియాలో భిన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు చెందిన ఓ నాయకుడు అప్పుడప్పుడు పంచెకట్టులో కనిపిస్తుంటారు. సీఎం రేవంత్ విసిరిన సెటైర్లు ఆయన గురించేనా? అనే ప్రశ్న ప్రామాణికంగా చర్చ జరుగుతోంది.

Popular Articles