Top 5 This Week

Related Posts

ఇలా అడ్డంగా దొరికిపోయారేం పాస్టర్ గారూ!?

స్క్రిప్ట్ మరచిపోయారు..
స్క్రీన్ ప్లే దొబ్బింది..
ఏమనుకోవద్దు!

సినిమా అయినా, లఘు చిత్రం అయినా ఆఖరికి స్కిట్ అయినా సరే స్క్రిప్ట్ ఉండాలి! మనసులో అనుకుని తీసేయడానికి మీరేం దాసరి నారాయణరావు గారు కాదు పాస్టర్ గారూ! ఆమాటకొస్తే ఆయన కూడా స్క్రిప్ట్ లేకుండా సినిమా చేయలేదు!

జగన్ కోడికత్తి, గులక రాయి కేసులు, చంద్రబాబు అలిపిరి కేసు, ఎన్టీఆర్ బాబ్జి కత్తి కేసు… ఇలాంటివి అన్నీ చదివి పాస్టర్ గారు బొక్కా బోర్లాపడ్డారు పాపం! స్క్రిప్ట్ జస్ట్ మనసులో అనుకుని వాట్సాప్ కాల్ లో ఒకసారి చెప్పేస్తే గుర్తు పెట్టుకోవడానికి అటు వైపు ఉన్నది రచయితలు, ఘోస్ట్ లు కాదు! కిరాయి కూలీలు! ఎన్ని కట్ లు ఎన్ని కెమెరా స్టార్ట్ లు చెబితే గానీ రక్తికట్టదు! అయినా మీకు కూడా ఒక సినిమాలో హీరో చేసిన అనుభవం ఉందిగా! ఇలా అడ్డంగా దొరికిపోయారేం పాస్టర్ గారూ..?

పాస్టర్ పాదయాత్ర చేస్తున్నాడు! సమస్యలు తెలుసుకుంటున్నాడు! జగన్, షర్మిల పాదయాత్రల్స్ కన్నా రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర గుర్తుకొస్తోంది! ప్రచారరథంపై ఎన్టీఆర్ నటన గుర్తుకొస్తోంది అని ఒక జర్నలిస్ట్ మిత్రుడు చెబితే… పోనీలే యువ నాయకుడు వచ్చాడు, అసెంబ్లీలోకి అడుగు పెడతాడు అనుకున్న! అనుకుని వారం రోజులు కూడా కాలేదు! యాక్షన్ వికటించింది! బీరు బాటిల్స్ తో పై పైన గీరండి అని డబ్బులు ఇస్తే, వాళ్లేమో స్క్రిప్ట్ మరచిపోయి నిజ్జంగానే పొడిచి దొబ్బారు! ‘ఉపాధి హామీ’ కూలీలు బాగా నటించారు. కానీ వాళ్ళకు రెమ్యూనరేషన్ తక్కువే!

ఇన్ని ఛానెల్స్, ఇన్ని యుట్యూబ్ లు ఉన్నాయనే విషయం పాస్టర్ గారు మరచిపోయారు! పైగా అందరూ ఒకేసారి వచ్చి లోగోలు పెడతారనుకుంటే గుంపుగా వచ్చారు కొందరు! కొందరు విడివిడిగా వచ్చారు! అందరికి ఒకేలా స్క్రిప్ట్ చెప్పడానికి రాసుకుంటే గుర్తు ఉంటుంది! అదే స్క్రిప్ట్ మనసులో ఉంటే అది నిముషం నిముషం మారిపోదా? స్క్రిప్ట్ నా మజాకా? మా పాల్ దేవుడిని ఏమీ అనకండి! అన్యాయం ఎక్కడ జరిగినా వెంటనే ఖండిస్తారు! అయనకేం తెలుసు పాపం పాస్టర్ బాగా నటిస్తాడని!

నిజానికి అభినయ దర్శన్ పాస్టర్ గారిలో మంచి టాలెంట్ వుంది! ఆలోచన వుంది! చిన్న వయసులోనే తక్కువ సేవ చేసి పెద్ద నాయకుడు కావాలనే అభిలాష వుంది! మాట వుంది! పలుకుబడి వుంది! అబద్ధాలు సూటిగా చెప్పగల దమ్ము వుంది! డబ్బు వుంది! దర్పం వుంది! లేనిదల్లా ఆయన చుట్టూ ఉన్న వారికే అతి తెలివి తేటలు! సరిగా నటించడం కూడా రాలేదు! సినిమా ఎలా హిట్ అవుద్ది బాసూ!

Popular Articles