Top 5 This Week

Related Posts

ఏసీబీ వలలో అటవీ శాఖ అవినీతి తిమింగలాలు

భద్రాచలం: అటవీ శాఖకు చెందిన అవినీతి తిమింగలాలు గురువారం అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కాయి. ఓ కాంట్రాక్టరు రోడ్డు నిర్మిస్తుండగా, చెట్లు ధ్వంసమయ్యాయనే అభియోగంపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ. 10 లక్షల మొత్తాన్ని లంచంగా డిమాండ్ చేసి, రూ. 3.50 లక్షల మొత్తాన్ని తీసుకుంటూ అటవీ అధికారులు ఏసీబీకి దొరికిపోయారు. ఈ లంచం మొత్తాన్ని తీసుకుంటూ ఏసీబీకి చిక్కన అటవీ అధికారుల్లో అటవీ శాఖకు చెందిన భద్రాచలం ఎఫ్ డీ వో సుజాత, చర్ల ఇంఛార్జి రేంజ్ ఆఫీసర్ కృష్ణయ్య ఉన్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. చర్ల మండలం పూసుకుగప్ప ప్రాంతంలో రోడ్డు నిర్మిస్తుండగా కొన్ని చెట్లు ధ్వంసమయ్యాయి. ఈ అంశంలో కేసు నమోదు చేయకుండా ఉండడానికి గాను ఎఫ్ డీ వో సుజాత సంబంధిత కాంట్రాక్టర్ ను రూ. 10.00 లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో రూ. 3.50 లక్షల మొత్తాన్ని తన కార్యాలయంలోనే లంచంగా స్వీకరిస్తూ సుజాతతోపాటు చర్ల ఇంఛార్జి రేంజ్ ఆఫీసర్ కృష్ణయ్యలు ఏసీబీకి చిక్కారు. ఈ ఘటనను ఏసీబీ ఉమ్మడి ఖమ్మం జిల్లా డీఎస్పీ వై. రమేష్ ధ్రువీకరించారు. ఈ ఇద్దరు అటవీ అధికారులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రమేష్ ‘సమీక్ష’ న్యూస్ తో చెప్పారు.

Popular Articles