Top 5 This Week

Related Posts

ప్రభుత్వ సలహాదారులుగా శివధర్ రెడ్డి, వీహెచ్

హైదరాబాద్: తెలంగాణా ప్రభుత్వం ఇద్దరు సలహాదారులను నియమించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా బి. శివధర్ రెడ్డి, వి. హనుమంతరావులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఈరోజు పదవీ విరమణ చేసిన డీజీపీ బి. శివధర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారునిగా నియమించారు.

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావును కూడా ప్రభుత్వ సలహాదారునిగా నియమించారు. బీసీ సంక్షేమ విభాగంలో వి. హనుమంతరావును క్యాబినెట్ ర్యాంక్ కల్పిస్తూ సలహాదారునిగా ప్రభుత్వం నియమించింది. ఈ ఇద్దరి నియామకపు ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.

Popular Articles