Top 5 This Week

Related Posts

ఖమ్మం వ్యాపారికి సైబర్ నేరగాళ్ల రూ. 2.00 కోట్ల టోకరా

ఖమ్మం: సైబర్ క్రిమినల్స్ ఖమ్మం వ్యాపారి ఒకరికి రూ. 2.00 కోట్ల మొత్తానికి టోకరా వేశారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని ఆ వ్యాపారి రూ. 2.00 కోట్ల మొత్తానికి మోసపోయారు. ఈ ఉదంతంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం వెల్లడించారు.

ఆయన కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యాపారవేత్తకు వాట్సప్ ద్వారా పరిచయమైన వ్యక్తులు ఆన్ లైన్ లో ట్రేడింగ్, ఇన్వెస్ట్ చేస్తే అధికా లాభాలు వస్తాయని ఆశ చూపారు. Fx Pro అనే కంపెనీలో ట్రేడింగ్, పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి వివిధ ట్రేడింగ్ లింకుల ద్వారా రూ. 200 కోట్లను ఇన్వెస్ట్ చేయించారు. ఈ ఘటనలో రూ. 7.00 లక్షల మొత్తం బ్యాంక్ అకౌంట్లలోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆయా అకౌంట్ హోల్డర్స్ అయినటువంటి ఏపీకి చెందిన మహ్మద్ సాదిక్ (35), శ్యామ్ బాబు (21)లను తణుకు పట్టణంలో అరెస్ట్ చేసినట్లు సీపీ సునీల్ దత్ వివరించారు.అరెస్ట్ చేసిన నిందితులిద్దరినీ సైబర్ క్రైం కోర్టులో హాజరుపర్చి, రిమాండ్ కు తరలించామన్నారు.

అరెస్ట్ చేసిన నేరస్థులతో (ముసుగు వ్యక్తులు) సైబర్ నేరాల దర్యాప్తు టీం పోలీస్ అధికారులు

ఈ కేసు విచారణలో ప్రతిభను చూపిన సైబర్ క్రైం విభాగపు డీఎస్పీ వి. ఫణీందర్, సీఐ కొండపర్తి నరేష్, ఎస్ఐ రంజిత్ కుమార్, కానిస్టేబుళ్లు వెంకట కృష్ణారావు, కిషన్ రావు, స్టేషన్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

Popular Articles