ఢిల్లీ: కొత్తగూడెం నగరం కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) రైల్వే స్టేషన్ ఏర్పడి వందేళ్లకు చేరువవుతున్న సందర్బంగా కొత్త రైల్వే డివిజన్ ఆవశ్యకతను వివరించారు. భద్రాచలం రోడ్, దాని చారిత్రక నేపధ్యాన్ని కొనసాగిస్తూ కొత్తగూడెం కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ నెలకొల్పాలని ఆయన రైల్వే మంత్రిని కోరారు. వద్దిరాజు రవిచంద్ర వెంట బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే ఆర్ సురేష్ రెడ్డి కూడా ఉన్నారు.


