Top 5 This Week

Related Posts

ఘోర ప్రమాదం: టిప్పర్, బస్సు ఢీ: 14 మంది సజీవ దహనం

మార్కాపురం: ఏపీలోని మార్కాపురం జిల్లాలో గురువారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంకర లోడుతో వెడుతున్న ఓ టిప్పర్, ప్రయాణీకులతో గల మరో ప్రయివేట్ బస్సు ఢీకొన్న ఘటనలో 14 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాద తీవ్రత దృష్టా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 25-30 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో పది మంది వరకు ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే అప్రమత్తమై బస్సు దిగి తప్పించుకున్నట్లు సమాచారం. మృతుల్లో కనిగిరి, పామూరు ప్రాంతాలవారు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. టిప్పర్ ఓవర్ స్పీడ్ ప్రమాదానికి కారణంగా అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సు హైదరాబాద్ నుంచి పామూరువైపు ప్రయాణిస్తుండగా, టిప్పర్ చీమకుర్తి నుంచి మార్కాపురం వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో గాయపడినవారిని మార్కాపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. కాగా బస్సును హరిక్రిష్ణ ట్రావెల్స్ సంస్థకు చెందినదిగా గుర్తించారు.

Popular Articles