Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

మన్నె క్రిశాంక్ కన్నా ముందే చెప్పిన ‘సమీక్ష’

(సమీక్ష ప్రత్యేక కథనం)
రాష్ట్రంలో ‘మిస్ ఇన్ఫర్మేషన్’ మాఫియా నడుస్తోందంటూ బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ నిన్న ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో మన్నె క్రిశాంక్ లేవనెత్తిన ఆరోపణల్లో నిజానిజాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఒకటి, రెండు వెబ్ సైట్ల ‘విపరీత’ రాతల వెనుకగల మర్మంపై కొద్ది నెలల క్రితమే ‘సమీక్ష’ ఆసక్తికర వార్తా కథనాలను ప్రచురించింది.

గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిశాక, ఫలితాలకు ముందు రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన విజయ ధీమాపై తన ఫేస్ బుక్ వాల్ వేదికగా వెటకారపు వ్యాఖ్యలతో తిట్టిపోసిన ఓ ‘సైట్’ నిర్వాహకుడు అకస్మాత్తుగా తన రాతల పంథా’ మార్చడం మీడియా సర్కిళ్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏమిటీ ‘భజన’ వెనుక గల అసలు కథ? అనే ప్రశ్నలు మీడియా వర్గాల్లో రేకెత్తాయి. ఆ నేపథ్యంలోనే నిరుడు ఫిబ్రవరి 25వ తేదీన, గత అక్టోబర్ 29వ తేదీన ‘సమీక్ష’ న్యూస్ ప్రచురించిన రెండు వార్తా కథనాలను దిగువన గల ‘లింక్’ల ద్వారా ఇప్పుడూ చదవవచ్చు.

Popular Articles