ఛత్తీస్ గఢ్: సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య శనివారం జరిగిన భారీ ఎన్కౌంటర్ ఘటనలో 14 మంది నక్సలైట్లు మృతి చెందారు. చనిపోయిన నక్సల్స్ లో కుంట ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఘటనా స్థలం నుంచి ఏకే-47, ఇన్సాస్ తదితర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

