Top 5 This Week

Related Posts

కలకలం: చిట్ ఫండ్ కంపెనీపై ఫిర్యాదులు

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన కార్యకలాపాలు నిర్వహిస్తున్న కనకదుర్గ చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై చిట్స్ రిజస్ట్రార్ ఆఫీసుకు ఫిర్యాదులు అందాయి. ఈ చిట్ ఫండ్ కంపెనీ తన చందాదారులకు చెల్లించాల్సిన మొత్తాలను చెల్లించకుండా, వివిధ కారణాలతో వాయిదా వేస్తోందనేది ఫిర్యాదుల్లోని సారాంశం. కనకదుర్గ చిట్ ఫండ్ కంపెనీపై ఈ తరహా ఫిర్యాదులు అందినట్లు ఖమ్మంలోని అసిస్టెంట్ చిట్స్ రిజిస్ట్రార్ కార్యాలయమే ప్రకటించడం గమనార్హం.

అయితే కనకదుర్గ చిట్ కంపెనీ చందాదారులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలు తమ కార్యాలయంలో సంపూర్ణంగా అందుబాటులో లేవని అసిస్టెంట్ చిట్స్ రిజిస్ట్రార్ కార్యాయలం పేర్కొంది. అందువల్ల ఆయా సంస్థకు చెందిన ఖమ్మం, కొత్తగూడెం శాఖల చందాదారులు తమకు రావలసిన బకాయిలు, వాటికి సంబంధించిన ఆధార పత్రాలతో తమ కార్యాలయంలో ఏడు రోజుల్లోగా ఫిర్యాదు చేయాలని అసిస్టెంట్ చిట్స్ రిజిస్ట్రార్ కోరారు. దీంతో కనకదుర్గ చిట్ ఫండ్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ కార్యకలాపాలు చర్చనీయాంశంగా మారాయి.

Popular Articles