Top 5 This Week

Related Posts

విచారణకు సిద్ధం, ఖమ్మం రండి.. NIAకు పోటు రంగారావు లేఖ

ఖమ్మం: తనను విచారించడానికి ఖమ్మం రావలసిందిగా సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులను ఆహ్వానించారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ ఎన్ఐఏ అధికారులకు ఓ లేఖ రాశారు. ఈనెల 22వ తేదీన విచారణకు తాను ఖమ్మంలో అందుబాటులో ఉంటానని NIA అధికారులకు సమాచారమిస్తూ రంగారావుకు ఈ లేఖను పంపారు. పోటు రంగారావుకు ఈనెల 2వ తేదీన NIA నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.

పోటు రంగారావుపై దేశద్రోహం, ఉపా కేసు ఉందని, ఈనెల 22వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో NIA పేర్కొంది. CRPCలోని 160 సెక్షన్ కింద ఆయా నోటీస్ జారీ చేశారు. గత నవంబర్ 26వ తేదీన హైదరాబాద్ ఎన్ఐఏ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం.. బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 152, UA(P) యాక్ట్ లోని సెక్షన్ 13, 39 కింద కేసు నమోదైనట్లు నోటీసులో పేర్కొన్నారు.

ఒకవేళ తాము పేర్కొన్న స్థలానికి విచారణకు హాజరు కాలేనిపక్షంలో, ప్రత్యామ్నాయ స్థలంపై తమకు ఈనెల 15వ తేదీలోగా సమాచారం అందించాలని NIA అధికారులకు రంగారావుకు జారీ చేసిన నోటీసులో కోరారు. ఈ నేపథ్యంలోనే తాను విచారణకు సిద్దంగా ఉన్నానని, ఈనెల 22వ తేదీన ఖమ్మంలో అందుబాటులో ఉంటానని పోటు రంగారవు NIA అధికారులకు లిఖితపూర్వకంగా లేఖ రాస్తూ సమాచారం అందించారు.

Popular Articles