ఖమ్మం రూరల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) నూతన కార్యాలయాన్ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ రఘురాంరెడ్డి, సీపీ సునీల్ దత్ తో కలిసి ప్రారంభించారు. వరంగల్ క్రాస్ రోడ్డులో ఇదే భవనంలో ఆధునీకరించిన ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. బాధితులు నిర్భయంగా పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసే అనువైన పరిస్థితులు కల్పించేలా అధునాతన వసతులను ఈ భవనంలో కల్పించినట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.


