Top 5 This Week

Related Posts

మధిరలో డిప్యూటీ సీఎం పర్యటన

తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో పర్యటించారు. బోనకల్ మండలం లక్ష్మీపురంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ, దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు.

అంతకు ముందు ముదిగొండ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన లు చేశారు. బాణాపురం గ్రామం ఎస్సీ కాలనీ నుంచి మంగాపురం తండా గ్రామం వరకు 8 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మాణం చేయనున్న బీటీ రోడ్డు పనులకు, నాచెపల్లి గ్రామం నుంచి బాణాపురం తండా వరకు ఆరు కోట్ల 70 లక్షల రూపాయలతో నిర్మాణం చేయనున్న ఆర్ అండ్ బి బిటి రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు.

అదేవిధంగా ముదిగొండ మండల కేంద్రంలో రూ. 22 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 50 పడకల ప్రాధమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి, మండలంలోని 27 గ్రామాల్లో రూ. 4 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న 84 అంతర్గత రోడ్ల పనులకు, రూ. 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న పాల శీతలీకరణ కేంద్ర ప్రహారీగోడ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి పనులు త్వరితగతిన ప్రారంభించి, నాణ్యతతో రాజీ పడకుండా, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని భట్టి అధికారులను ఆదేశించారు.

Popular Articles