Top 5 This Week

Related Posts

వైఎస్ భారతిపై అసభ్య వ్యాఖ్యలు, టీడీపీ సీరియస్, పార్టీ కార్యకర్త సస్పెన్షన్

‘అమ్మా భారతీ.. నన్ను క్షమించమ్మా.. ఈరోజు నేను చేసిన వీడియలో చాలా తప్పుగా మాట్లాడాను. మీ కాళ్లు పట్టుకుని… నేను చాలా తప్పు చేశాను. క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది.. నేను చేసింది చాలా తప్పు.. మహిళ గురించి ఇలా మాట్లాడడం చాలా తప్పు. దయచేసి క్షమించండి..ప్లీజ్.. నేను ఇక నుంచి వీడియోలు చేయదల్చుకోలేదు’ అంటూ టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతిని అభ్యర్థిస్తూ కొద్దిసేపటి క్రితం ఓ వీడియో విడుదల చేశాడు.

ఏపీ మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ చేబ్రోలు కిరణ్ వీడియో ఉదంతం తీవ్ర కలకలానికి దారి తీసింది. అయితే చేబ్రోలు కిరణ్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై ఇటువంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదంటూ చేబ్రోలు కిరణ్ ను పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేసింది.

అంతేకాదు వైఎస్ భారతిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కిరణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా టీడీపీ నాయకత్వం పార్టీ నేతలను ఆదేశించింది. దీంతో టీడీపీ నాయకులు చేసిన ఫిర్యాదుపై గుంటూరు పోలీసులు చేబ్రోలు కిరణ్ పై కేసు నమోదు చేశారు.

Popular Articles