Top 5 This Week

Related Posts

బావిలోకి దూసుకెళ్లిన కారు

కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు గ్రామ శివారులో గల ఓ వ్యవసాయ బావిలోకి స్విఫ్ట్ కారు దూసుకెళ్లింది. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ మార్గంలో పయనిస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం.

కారు బావిలో పడిన దృశ్యం

బావిలో మునిగిన కారులో అయిదుగురు వ్యక్తులు ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బావిలో మునిగిన కారును పోలీసులు బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Popular Articles