Top 5 This Week

Related Posts

‘ఛానల్’ విలేకరిపై కేసు

యూ ట్యూబ్ ఛానల్ విలేకరి ఒకరిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రిపూట కర్ఫ్యూలో పోలీసులు లాఠీచార్జ్ చేశారంటూ నకిలీ వీడియోలు పోస్ట్ చేశారనే అభియోగంపై పోలీసులు ఆయా విలేకరిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో నకిలీ వీడియోలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రజల్లో అశాంతి, భయందోళన కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కాగా ఈ వీడియోను మరికొందరు తమ ఫేస్ బుక్ ఖాతాల్లో పోస్ట్ చేసిన ఉదంతంపై కూడా పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం.

Popular Articles