హైదరాబాద్: తెలంగాణాలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆర్టీ నెం. 540 ద్వారా 13 మంది ఐఏఎస్ అధికారులను, జీవో ఆర్టీ నెం. 541 ద్వారా 11 మందిని కలుపుకుని మొత్తం 24 మంది ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం స్థాన చలనం కలిగించింది.
బదిలీకి గురైన ఐఏఎస్ అధికారుల్లో సంజయ్ కుమార్, దాన కిషోర్, బి. విజయేంద్ర, హరిచందన, క్రిష్ణ ఆదిత్య, జెండగె హేమంత్ కుమార్, పి. ప్రావీణ్య, బీఎం సంతోష్, అనుదీప్ దురిశెట్టి, అభిలాష అభినవ్, జీవీ శ్యాం ప్రసాద్, జి. ముకుందరెడ్డి, అపూర్వ్ చౌహాన్ లు బదిలీ అయ్యారు.
అదేవిధంగా భవేష్ మిశ్రా, ప్రియాంక అల, ప్రతీక్ జైన్, దివాకర, భరఖడె హేమంత్, సి. ప్రియాంక, హేమంత కేశవ్, మందా మకరందు, లెనిన్ వత్సల్, కిరణ్మయి కొప్పిశెట్టి, యువరాజ్ మర్మత్ లు కూడా బదిలీ అయ్యారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకరను నియమించారు.
బదిలీకి గురైన అధికారుల వివరాలు దిగువన గల పీడీఎఫ్ ఫైల్స్ లో చూడవచ్చు..

