హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది అదనపు, స్పెషల్ గ్రేడ్, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ ఉత్తర్వు జారీ చేశారు. ప్రస్తుత హోదా నుంచి బదిలీ అయిన స్థానం, అధికారుల వివరాల్లోకి వెడితే..
బి. హరిసింగ్ ను సూర్యాపేట అదనపు కలెక్టర్ గా, ఆర్ డీ మధురిని నల్లగొండ స్పెషల్ కలెక్టర్ గా, డి, రాజ్యలక్ష్మిని పెద్దపల్లి అదనపు కలెక్టర్ గా, సీహెచ్. మధు మోహన్ ను గద్వాల అదనపు కలెక్టర్ గా, టీఎల్ సంగీతను సంగారెడ్డి అదనపు కలెక్టర్ గా, వి. హునుమా నాయక్ ను వరంగల్ స్పెషల్ కలెక్టర్ గా, ఎం. సూర్య ప్రకాష్ ను వనపర్తి డీఆర్వోగాగా, సీహెచ్. వెంకటేశ్వర్లును జనగామ డీఆర్వోగా, బి. వసంత కుమారిని భూపాలపల్లి డీఆర్వోగా బదిలీ చేశారు.
అదేవిధంగా ఎస్. పద్మావతిని భద్రాద్రి కొత్తగూడెం, వి. రమాదేవిని సిరిసిల్ల, జుబేదున్నీసా బేగంను మహబూబాబాద్, డి. వేణును ఆసిఫాబాద్, బి. స్రవంతిని ఆదిలాబాద్, ఎస్. రాజేశ్వరిని నారాయణపేట, కె. శ్రీనివాస్ ను హన్మకొండ డీఆర్వోలుగా బదిలీ చేశారు.
ఇక ఎల్. రమేష్ ను నారాయణపేట, రవీందర్ రెడ్డిని బాన్సువాడ ఆర్డీవోలుగా , బి. గీతను నిజామాబాద్ డీఆర్వోగా, జి. అంబదాస్ ను మెదక్ డీఆర్వోగా, ఎం. షర్మిలను ఉట్నూరు, ఎం. విజయకుమారిని బోధన్, ఎస్. రమణారెడ్డిని మిర్యాలగూడ, దోనకంటి రవీందర్ ను కాటారం, ఎన్. రాజేందర్ రెడ్డిని సిరిసిల్ల, కేఎస్బీ కుమారిని వేములవాడ, పి. పద్మప్రియను దేవరకొండ ఆర్డీవోలుగా బదిలీ చేశారు.
ఆయా అధికారుల బదిలీ ఉత్తర్వు ప్రతిని దిగువన గల పీడీఎఫ్ ఫైల్ లోనూ చూడవచ్చు..

