- సృష్టిలో కంటి చూపుతోనే సర్వం
- శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి
- శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు
“సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అని, కంటి చూపు లేకపోతే ఈ సృష్టి శూన్యమని శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి అన్నారు. అలాంటి చూపును పదిలంగా కాపాడుకోవాలని ఆయన కోరారు. శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, వాసన్ ఐ కేర్ సౌజన్యంతో శుక్రవారం ఖమ్మంలోని శ్రీ బాలాజీ కార్పోరేట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య పరీక్షల్లో రవి పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

ఈ సంధర్భంగా రవి మాట్లాడుతూ, వయసు మీరుతున్న కొద్దీ కంటి చూపు మందగించడం సర్వసాధారణమన్నారు. నలభై ఏళ్ళ వయసు దాటిన తర్వాత ఏడాదికోసారి కంటి వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరమన్నారు. అలాగే చూపు మందగించకుండా ఉండటానికి “ఎ” విటమిన్ కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

ఈ ఉచిత వైద్య శిబిరంలో 400 పైచిలుకు మంది కంటి పరీక్షలు చేయించుకోగా, వారికి బీపీ, షుగర్ వంటి టెస్టులు కూడా చేశారు. ఈ కార్యక్రమంలో కొణిజర్ల మాజీ ఎంపీపీ గోసు మధు, ఆఫీసు, మార్కెటింగ్ సిబ్బందితో పాటు వాసన్ ఐ కేర్ సిబ్బంది అఫ్సర్, వెంకటేష్, గోపి చందు, తేజస్విని పాల్గొన్నారు.

