తెలంగాణా రాష్ట్ర కొత్త చీఫ్ సెక్రటరీగా కె. రామకృష్ణారావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఫైనాన్స్ విభాగానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు 1991 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. తెలంగాణా ప్రస్తుత సీఎస్ గా వ్యవహరిస్తున్న ఎ. శాంతి కుమారి ఈనెల 30వ తేదీన పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో కొత్త చీఫ్ సెక్రటరీగా రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.


