అనంతపురం: రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్పై పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హేమంత్ చనిపోయినట్లు తెలుస్తున్న సమాచారం ధ్రువపడాల్సి ఉంది. అయితే హేమంత్ చనిపోయాడనే సమాచారాన్ని ఇంకా పోలీసు అధికారులు ధృవీకరించలేదు. రాప్తాడు ఘటనలో ఓ బాలికను పవర్ రంపంతో నిన్న దాడిచేసిన సంగతి తెలిసిందే.
నిందితుని కోసం పోలీసులు నిన్నటి నుంచీ గాలిస్తున్నారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు వద్ద అడవిలో హేమంత్ దాచుకున్నట్లు సమాచారం వచ్చి వెళ్లిన పోలీసులు. అయితే పోలీసులను చూసి రాళ్లతో దాడి చేసి హేమంత్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో హేమంత్పై పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన హేమంత్ ను అనంతపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స జరిపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినిపై చెట్లు కట్ చేసే రంపు మెషిన్‌తో హేమంత్ అత్యంత కిరాతకంగా దాడి చేశాడు.

