Top 5 This Week

Related Posts

వెరైటీ నేరాలకు పాల్పడిన కానిస్టేబుల్ అరెస్ట్

హైదరాబాద్: శాంతిభద్రతలను పరిరక్షించే విధులు నిర్వర్తించాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్ వినూత్న తరహా నేరాలకు పాల్పడిన ఘటన హైదరాబాద్ మీర్ పేట్ లో వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో కానిస్టేబుల్ పై కేసు నమోదు చేయడంతోపాటు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు కూడా తరలించారు.

మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న శ్రవణ్ కుమార్ అనే కానిస్టేబుల్ ఓ కేసు దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ నుంచే నగదు తస్కరణకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం రూ.1.70 లక్షలను తన బంధువుల ఖాతాలకు శ్రవణ్ బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు.

అంతేగాక ఈ కేసులో స్వాధీనం చేసుకున్న 12 తులాల బంగారాన్ని సైతం శ్రవణ్ తాకట్టు పెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన మీర్ పేట్ పోలీసులు కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Popular Articles