Top 5 This Week

Related Posts

తుపాన్ నష్టం అంచనాకు బైకుపై మంత్రి పర్యటన

సత్తుపల్లి: చేతిలో కర్ర, నెత్తిన టోపీ, టీ షర్ట్, ప్యాంటు ధరించి బైకుపై వెనకాల కూర్చుని ప్రయాణాస్తున్నదెవరో తెలుసా..? ఎవరో సాధారణ వ్యక్తి కాదు సుమీ! ఆయన సాక్షాత్తూ తెలంగాణా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు..! ముందు ఎస్కార్ట్.. రక్షణకు గన్ మెన్లు, ప్రయాణించేందుకు ప్రభుత్వ వాహనాలను ఉన్నప్పటికీ, వాటన్నింటినీ వదిలేసి ఇలా బైకుపై ఎక్కడికి వెడుతున్నారు.. అనుకుంటున్నారా..?

మురసు తుపాన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాను అతలాకుతలాం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సత్తుపల్లి, అశ్వారావుపే నియోజకవర్గాల్లో తీరని నష్టాన్ని కలిగించింది. సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో చిక్కుకున్న మత్స్యకారులను, వారిని రక్షించేందుకు బోట్లపై వెళ్లి గల్లంతైన పోలీసులను, NDRF సిబ్బందిని రక్షించడంలో తనదైన శైలిలో దిశానిర్దేశం చేసి ఒక్క ప్రాణానికి కూడా నష్టం కలగకుండా అధికార యంత్రాంగాన్ని నడిపించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు శుక్రవారం ఇలా బైకుపై ప్రయాణించడం విశేషం.

భారీ వర్షాలు, వరదనీటికి దెబ్బతిన్న పంట పొలాలకు, పండ్ల తోటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు మంత్రి తుమ్మల బైకుపై దమ్మపేట మండలంలోని మురసు తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో కలియదిగిగారు. తద్వారా పంట నష్టాన్ని అంచనా వేయడంలో అధికార యంత్రాంగానికి సలహాలు, సూచనలు ఇచ్చారు. తుపాన్ ధాటికి దమ్మపేట మండలంలో చేతికొచ్చిన వరిపొలాలు నేలకు ఒరగగా, బొప్పాయి వంటి పండ్లతోటలు భారీ ఎత్తును విధ్వంసానికి గురయ్యాయి. అనేక చోట్ల వంతెనలకు, రోడ్లకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.

Popular Articles