Top 5 This Week

Related Posts

ఖమ్మం జిల్లాలో 11 మంది పోలీసుల గల్లంతు

సత్తుపల్లి: మురసు తుపాన్ వరద నీటిలో ఖమ్మం జిల్లాకు చెందిన 11 మంది పోలీసులు గల్లంతయ్యారు. సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు వద్ద చిక్కుకుపోయిన మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన పోలీసులు వరద నీటీలో బోటు తిరగబడి గల్లంతైనట్లు ప్రాథమిక సమాచారం.

వరదనీటిలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు చాతకొండ 6వ బెటాలియన్ కు చెందిన SDRF కు చెందిన పోలీసులు బేతుపల్లి చెరువులోకి రెండు బోట్లలో వెళ్లారు. అయితే పోలీసులు ప్రయాణిస్తున్న రెండు బోట్లు నీటి ఉధృతికి తిరగబడడంతో 11 మంది పోలీసులు గల్లంతైనట్లు సమాచారం. బేతుపల్లి చెరువు నీటి నుంచి తమ్మిలేరు వాగులోకి పోలీసులు గల్లంతైనట్లు తెలుస్తోంది.

కాగా చేపల వేట కోసం ఏర్పాటు చేసిన వలలు చిక్కుకోవడం వల్లే బోట్లు తిరగబడినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గల్లంతైనవారు ఈతలో నిష్ణాతులని, వారివద్ద లైఫ్ జాకెట్లు కూడా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వరదనీటిలో గల్లంతైన పోలీసులు సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుందాం.

సీఎం రేవంత్ ఆరా:
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువులో ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్ల గల్లంతుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు సీఎం సూచించారు.

Popular Articles