Top 5 This Week

Related Posts

తెలంగాణా డీజీపీ ఎదుట బడ్సే దేవా టీం లొంగుబాటు

హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) చీఫ్ బడ్సే సుక్కా అలియాస్ దేవా సహా 20 మంది నక్సల్స్ తెలంగాణా డీజీపీ బి. శివధర్ రెడ్డి ముందు శనివారం లొంగిపోయారు. PLGA బెటాలియన్ -1 కమాండర్ గా వ్యవహరిస్తున్న దేవా దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగానూ ఉన్నారు. డీజీపీ ముందు లొంగిపోయిన నక్సల్స్ లో రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకనాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ కూడా ఉన్నారు.

దేవా, రాజిరెడ్డి తదితర నక్సల్స్ లొంగిపోయిన చిత్రం

లొంగిపోయిన సందర్బంగా 48 తుపాకులను, 93 మ్యాగ్జిన్లను, 2,206 తూటాలను కూడా మావోయిస్టులు పోలీసులకు అప్పగించారు. వీరివద్ద నుంచి రూ. 20.30 లక్షల నగదు మొత్తాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మొత్తం 20 మంది నక్సల్స్ లో ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు, ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు, ఏడుగురు ఏరియా కమిటీ సభ్యులు, 8 మంది పార్టీ సభ్యుల చొప్పున ఉన్నారు.

Popular Articles