Top 5 This Week

Related Posts

ఖమ్మం జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా: 9 మంది అరెస్ట్

ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాల దందా సాగుతోంది. దీంతో ఖమ్మం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగానే కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతున్న నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రంపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. మూడు వేర్వేరు చోట్ల పోలీసులు జరిపిన దాడుల్లో రూ. 14.00 లక్షల విలువ చేసే 560 కిలోల నకిలీ విత్తనాలు పట్టుకుని, తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. మొత్తం మూడు గ్యాంగులకు చెందిన 11 మంది నకిలీ విత్తనాల దందాకు పాల్పడినట్లు పోలీసులు కనుగొన్నారు. నకిలీ విత్తనాల దందాపై పూర్తి వివరాలను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శుక్రవారం ఏన్కూరు పోలీస్ స్టేషన్ లో మీడియాకు వెల్లడించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎవరైనా ప్రముఖ బ్రాండెడ్‌ కంపెనీల విత్తనాల పేరుతో నాసి రకం, నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రైతులు సైతం విత్తనాల కొనుగోలు సమయంలో అప్రమత్తత పాటించాలని, తక్కువ ధరకు తెలియని వ్యక్తుల నుండి కొనుగోలు చేసి మోసపోవద్దని పోలీస్ కమిషనర్ సూచించారు. కొంతమంది దళారులు ముఠాలుగా ఏర్పడి, తక్కువ డబ్బుకు విత్తనాలు ఇస్తామని ఆశ చూపి రైతులను మోసం చేస్తారని, ఇటువంటి వారిపై గ్రామాల్లో సైతం నిఘా పెట్టామని సీపీ తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే మండల వ్యవసాయ శాఖ అధికారికి గాని, స్ధానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మార్కెట్ లో నకిలీ విత్తనాల విక్రయం జరుగకుండా టాస్క్ ఫోర్స్ బృందాలతో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. కాగా మీడియా సమావేశంలో నకిలీ విత్తనాల గురించి సీపీ సునీల్ దత్ వెల్లడించిన కేసు వివరాలు ఇలా ఉన్నాయి.

ఈనెల 28వ తేదీన ఏన్కూర్ పోలీస్, వ్యవసాయ అధికారుల ఉమ్మడి తనిఖీలలో భాగంగా ఏన్కూర్ గ్రామానికి చెందిన గాజుల నరసింహారావు (49) అనే వ్యక్తి కొద్దిమంది రైతులకు అనుమతిలేని పత్తి విత్తనాలను అమ్ముతున్నాడని సమాచారం అందింది. దీంతో తనిఖీ నిర్వహించగా అతని వద్ద 450 గ్రాములు బరువు గల అడ్వాన్స్ 555 పేర్లతో ఉమ్మడి పత్తి విత్తనాల ప్యాకెట్లు దొరకగా సీజ్ చేశారు. విచారణలో ఈ పత్తి విత్తనాలను ఆంధ్రప్రదేశ్ లోని మైలవరం మండలం చంద్రు గూడెం గ్రామానికి చెందిన శాలివాహన అనే వ్యక్తి వద్ద నుండి కిలో 450 గ్రాముల ప్యాకెట్లను 400 రూపాయలకు కొనుక్కొచ్చి ఇక్కడ 1,200 రూపాయలకు అమ్ముతున్నాడని వెలుగులోనికి వచ్చింది. శాలివాహన అనే వ్యక్తి తన ఇంటి వద్ద ఒక కుటీర పరిశ్రమలాగా నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు.

ఇతను కర్ణాటక నుండి పత్తి విత్తనాలు, వాటిని ట్యాగ్ చేయడానికి ప్రింటెడ్ అడ్వాన్స్ త్రిబుల్ ఫై నెంబర్ గల కవర్ తో ఉన్న ప్యాకెట్స్ తో తీసుకొచ్చి తన ఇట్టిపతి విత్తనాలను రైజోబెల్ మిశ్రమాన్ని కలిపి ఆరబెట్టి ఇట్టిపత్తి విత్తనాలను ప్యాకెట్లలో నింపి సీల్ చేసి విక్రయిస్తుంటారు. ఇందులో భాగంగానే గాజుల నరసింహారావు మరి కొందరు ఏజెంట్ల ద్వారా రైతులకు అధిక దిగుబడి వస్తుందని అలాగే కలుపు మందు వలన ఇబ్బంది ఉండదని నమ్మించి ఒక్కొక్క ప్యాకెట్ 1,200 రూపాయలకు అమ్ముతున్నట్లు పోలీసులు కనుగొన్నారు. అతని ఇంటి వద్ద నుండి ఒక క్వింటా రైజోబెల్ మిశ్రమం కలిపి పెట్టి ప్యాక్ చేయన్ని పత్తి విత్తనాలు, 450 గ్రాములు బరువు కలిగి అరుణోదయ లేబల్ తో ఉన్న (272) పత్తి విత్తన ప్యాకెట్లను, అలాగే ప్యాకెట్ సీల్ చేయడానికి వాడే (2) మిషన్లు, ఒక వేయింగ్ మిషన్, ప్రత్తి విత్తనములు పక్క చేయుటకు అరుణోదయ లేబల్ తో ఉన్న సుమారు (400) ఖాళీ పాక్కెట్లు, రెండు లీటర్ల రైజోబెన్ మిశ్రమాన్ని సీజ్ చేశారు.

నకిలీ పత్తి విత్తనాల పాకెట్లను పరిశీలిస్తున్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఇతర అధికారులు

అదేవిధంగా మరో గటనలో ఈనెల 27వ తేదీన ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామ శివారున నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారనే సమాచారంతో వెనిగండ్ల శ్రీహరి రావు అనే వ్యక్తి వ్యవసాయ భూమిలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ (210) ఒక కేజీ ప్యాకెట్లలో ఉన్న నకిలీ పత్తి విత్తనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వెనిగండ్ల శ్రీధర్ రావు ఇచ్చిన సమాచారం మేరకు అతని అనుచరుడైన ఇమ్మినేని కిషోర్ ఇంటి వద్ద తనిఖీ చేయగా సుమారు 120 కిలోల పత్తి విత్తనాలు లభించాయి. అలాగే పత్తి విత్తనాలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్న రైజోబిన్ కెమికల్, వేయింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు. వెనిగండ్ల శ్రీహరి రావు గత కొంతకాలంగా బాపట్ల జిల్లాలో ఉన్న తన బంధువైన లక్ష్మీనారాయణ ద్వారా కిలో 800/- రూపాయాలకు నకిలీ, ఎటువంటి అనుమతి లేని విత్తనాలు తెప్పిస్తూ ఏనుకూరు మండల రైతులకు అధిక దిగుబడి వస్తున్న వంగడాలని నమ్మించి కిలో రూ 2,600/- రూపాయలకు అమ్ముతూ లాభాలు గడిస్తున్నాడని పోలీసుల విచారణలో తెలిసినది.

ఇక మూడో ఘటనలో శుక్రవారం ఏన్కూరు గ్రామంలో పోలేటి కోటేశ్వరరావు ఇంటి వద్ద తనిఖీ చేయగా అతని వద్ద ఇరవై నకిలీ ప్రతి విత్తనాల ప్యాకెట్లు లభ్యమయ్యాయి. అతనిని విచారించగా తెనాలి జిల్లా నుండి తీసుకొచ్చి ఎటువంటి అనుమతులు లేకుండా పత్తి విత్తనాలను అమ్ముతున్నాడని పోలీసులు వెల్లడించారు. నకిలీ విత్తనాల దందాకు సంబంధించి ఆయా మూడు ఘటనల్లో పోలీసులు అరెస్టు చేసిన నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి:

పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ పత్తి విత్తనాలు, వాటి తయారీకి వినియోగించే ఇతర సామాగ్రి

GANG-1
A-1:- వెనిగండ్ల శ్రీహరి రావు తండ్రి: సంజీవరావు, 60 సం, కమ్మ, వ్యాపారం R/o హిమం నగర్ .
A2: ఉమ్మనేని నరేష్, వయస్సు 39 సం , R/o ఏనుకూరు .
A3: అన్నెం లక్ష్మీనారాయణ 60 సం, R/o భీమవరం గ్రామం, ఇంకొల్లు మండలం
A-4:-గూగులోతు గోపి 40 సం, R/o హిమం నగర్
A-5:- వరదబోయిన రమేష్, 40 years, R/o రేపల్లెవాడ
A6: తాంబళ్ళ నవీన్ R/o రేపల్లెవాడ
A7: దొంతబోయిన రమేష్ R/o రేపల్లెవాడ

GANG-2
A1: గాజుల నరసింహారావు 49 సం R/o ఏనుకూరు
A2:చర్లపల్లి శాలివాహన 45 సం, R/o చంద్ర గూడెం, మైలవరం మండలం

GANG-3
1) పోలేటి కోటేశ్వరరావు 36 సం, R/o ఏనుకూరు గ్రామము
2) వెనిగండ్ల రవి, 45 సం, R/o ఇంకొల్లు మండలం, బాపట్ల జిల్లా.

Popular Articles