Top 5 This Week

Related Posts

‘పాస్టర్’ ఛీట్ చేశాడని మహిళ ఆత్యహత్యాయత్నం

ఓ చర్చి పాస్టర్ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ ఆత్యహత్యాయత్నానికి పాల్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో చోటు చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. సారపాక చర్చి పాస్టర్ సువర్ణరాజు తన ఆత్మహత్యకు బాధ్యతునిగా ఆరోపిస్తూ సులోచన అనే మహిళ పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.

దాదాపు పధ్నాలుగేళ్ల క్రితం తనకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని, అనంతరం తనకు ఓ బాబు కూడా జన్మించాడని సులోచన పేర్కొంది. బాబు పుట్టిన తర్వాత తన దగ్గరకు రాకుండా ముఖం చాటేసి తప్పించుకు తిరుగుతున్నాడని ఆమె ఆరోపించారు. తనకు న్యాయం జరగదని భావించి, మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోలోచన సూసైడ్ లెటర్ రాసింది.

పురుగుల మందు తాగిన సులోచన ఆపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను చికిత్స కోసం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు.

Popular Articles