Top 5 This Week

Related Posts

అష్టాదశ శక్తి పీఠం వద్ద సీఎం కేసీఆర్

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన కొల్హాపూర్‌ లోని శ్రీ అంబాబాయి మహాలక్ష్మీ అమ్మవారిని తెలంగాణా సీఎం కేసీఆర్ దర్శనం చేసుకున్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గురువారం ఉదయం మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు బయలుదేరి వెళ్లారు.

హైదరాబాద్ నుంచి కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో కొల్హాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్, మధ్యాహ్నం కొల్హాపూర్ లోని శ్రీ అంబాబాయి మహాలక్ష్మీ ఆలయానికి చేరుకోగా, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో కార్వీర్ నివాసిని శ్రీ అంబాబాయి మహాలక్ష్మి అలంకార పూజలో సీఎం కేసీఆర్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ దంపతుల వెంట రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు, టి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

Popular Articles