Top 5 This Week

Related Posts

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ మృతి!

బీఆర్ఎస్ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) ఆదివారం కన్ను మూశారు. గుండెపోటు రావడంతో ఈనెల 5వ తేదీ నుంచి గచ్చిబౌలి ఏఐసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపీనాథ్ ఈ ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. గోపీనాథ్ కన్నుమూసిన విషయాన్ని ఆసుపత్రికి చెందిన వైద్యులు వెల్లడించారు.

ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గోపీనాథ్ 2014లో తొలిసారి టీడీపీ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2018లో బీఆర్ఎస్ లో చేరి వరుసగా 2018, 2023 ఎన్నికల్లో గెలుపొందారు. మొత్తం మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపీనాథ్ మృతి ఘటన బీఆర్ఎస్ పార్టీలో తీరని విషాదాన్ని నింపింది.

Popular Articles