Top 5 This Week

Related Posts

‘సుక్క’ దొరక్క… ‘తిక్క’ రోగం… ఎర్రగడ్డ దవాఖాన కిటకిట!

అది కల్లు కావచ్చు… మద్యం కావచ్చు… ఇతరత్రా మత్తు పదార్థం కావచ్చు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ పరిస్థితి మద్యపాన ప్రియులకు పిచ్చి రేపుతోంది. మద్యానికి బానిసైన అనేక మంది వింతగా ప్రవర్తిస్తూ అత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా అనేకం వెలుగు చూస్తున్నాయి. తాజాగా సోమవారం హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి ఇటువంటి రోగులతో కిటకిటలాడింది. మద్యం దొరక్కపోవడంతో అనేక మంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. మరికొందరైతే వ్యక్తిగతంగా తమకు తాము గాయాలు చేసుకుంటున్నారు. ఇటువంటి వింత ప్రవర్తన గల వందకు పైగా బాధితులు ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి వచ్చారు. దవాఖానలోనే వారి ప్రవర్తనకు సంబంధించిన వీడియోను దిగువన చూడవచ్చు.

https://www.youtube.com/watch?v=UmmLUR9tmKQ

Popular Articles