హైదరాబాద్: బండ్లగూడ సుప్రీం వైన్స్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య కేసులో పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి సహా ముగ్గురిని నాగోల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఖమ్మం నగరానికి చెందిన కె. ఉమా మహేష్ @ జేకే మహేష్ (34), సాయినగర్‌కు చెందిన మహమ్మద్ మున్నా @ బోలె (47), ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన దుగ్గిరాల కార్తీక్ (29)లను ఎల్.బి.నగర్‌లో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.
ఈ నెల 14వ తేదీన బండ్లగూడ సుప్రీం వైన్స్‌లో నయీమ్‌పై నిందితులు వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈ నెల 16న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారి ఉమా మహేష్ మాత్రం అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని, తాజాగా అతడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు నాగోల్ పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మంది అరెస్టు కాగా, తాజాగా మరో ముగ్గురి అరెస్టుతో మొత్తం అరెస్టుల సంఖ్య 11కు చేరినట్లు తెలిపారు.

