Top 5 This Week

Related Posts

ఏడాదిగా రిలేషన్ షిప్.. ఆ నలుగురే నా చావుకి కారణం: ట్రైనీ ఐపీఎస్ సూసైడ్ నోట్

హైదరాబాద్: శిక్షణలో గల మహిళా ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న మరో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు ముందు రాసినట్లు పేర్కొంటున్న సూసైడ్ నోట్ లో ఉదయ్ కృష్ణారెడ్డి మహిళా ఐపీఎస్ అధికారిపై సంచలన ఆరోపణలు చేశారు. ఈమేరకు ఉదయ్ కృష్ణారెడ్డి రాసినట్లు పేర్కొంటున్న సూసైడ్ నోట్ మీడియాకు లీకైంది.

ఆ నోట్ లో ఉదయ్ కృష్ణారెడ్డి పలు ఆరోపణలు చేశారు. నిరుడు జూన్ నెల నుంచి తాను, తనపై ఆరోపణలు చేసిన మహిళా ఐపీఎస్ అధికారి రిలేషన షిప్ లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆమె పెళ్లయిన తర్వాత కూడా, తాము ఫిజికల్ గా, ఎమోషనల్ గా రిలేషన్ షిప్ లో ఉన్నామని, ఈ బంధం కొనసాగిందని అన్నారు. ఆమె మాత్రమే తన గదికి వచ్చేదని, డోర్ తీయాలని వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసేదని అన్నారు. డోర్ ఓపెన్ చేయాలనే అంశంలో ఓరోజు గొడవకు దిగిందని, తాను ఇదంతా తన ఐ ఫోన్ లో రికార్డ్ చేశానని, డిఫెన్స్ తోనే తాను ఈ విధంగా రియాక్టయినట్లు ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ పరిణామంపై వీడియో ప్రూఫ్ ఉందన్నారు.

ఈ నేపథ్యంలోనే ఈనెల 9వ తేదీన ఆమె తన గదికి వచ్చిందని, లైంగిక కోరిక తీర్చాలని వాటేసుకుని, ముద్దు కూడా పెట్టుకుందని, ఇదంతా తన అనుమతి లేకుండానే జరిగిందన్నారు. అందువల్లే దీన్ని కూడా తాను రికార్డ్ చేసి ఆమె భర్తకు పంపానని, తన రూంకి రావద్దని అంతకు ముందే చెప్పినా ఆమె వినలేదన్నారు. ఇందుకు సంబంధించి వాట్సాప్ చాట్ కూడా ఉందన్నారు.

అయితే ఇరువురి మధ్య జరిగిన స్టోరీని వక్రీకరించి చేసి తనపై ఆరోపణలు చేసిందని, అది కరెక్ట్ కాదని ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇదంతా జరిగాక ఆమె ఇద్దరు స్నేహితులు ఆమెను రెచ్చగొట్టి తనపై ఆరోపణలు చేయించారని, వాస్తవాలు తెలియకుండా ఆమె స్నేహితులు ఆమెను రెచ్చగొట్టారని అన్నారు. తన చావుకి ఆమెతోపాటు ఆమె భర్త, ఇద్దరు స్నేహితులే కారణమని ఉదయ్ కృష్ణారెడ్డి తన సూసైడ్ నోట్ లో రాశారు. తాను చెబుతున్న అంశాలకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ బంధం ప్రారంభమైనప్పటి నుంచీ తన ఐ ఫోన్ లోనేగాక, ఆమె ఆండ్రాయిడ్ పోన్ లో కూడా ఉన్నాయన్నారు. ‘సత్యమేవ జయతే’ అని ఉదయ్ కృష్ణారెడ్డి తన సూసైడ్ లేఖను ముగించారు.

Popular Articles