Top 5 This Week

Related Posts

ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: శిక్షణలో గల ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. ఓ మహిళా ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే అభియోగాలపై అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను తాత్కాలికంగా నేషనల్ పోలీస్ అకాడమీ అధికారులు సస్పెండ్ చేశారు.

ఈ పరిణామాల్లోనే ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎర్రగడ్డ మోతీనగర్ లోని తన బంధువుల ఇంటికి వచ్చిన ఉదయ్ కృష్ణారెడ్డి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అతన్ని వెంటనే ఎస్ఆర్ నగర్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా తనపై వచ్చిన ఆరోపణలు, ప్రచారం అవాస్తవాలంటూ ఉదయ్ కృష్ణారెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టినట్లు సమాచారం. చట్టంపై తనకు పూర్తి నమ్మకముందని,న్యాయం గెలుస్తుందని ఆయా పోస్టులో ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Popular Articles