ఖమ్మం: ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తేదీ ఖరారైంది. ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మంగళవారం వెల్లడించారు. జిల్లాలోని చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించే రైతు ఆశీర్వాద సభలో సీఎం పాల్గొంటారని తుమ్మల పేర్కొన్నారు. గత నెల 30వ తేదీన జరగాల్సిన ఈ రైతు ఆశీర్వాద సభ భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

