Top 5 This Week

Related Posts

సీఎం సభా ఏర్పాట్లను పరిశీలించిన ఇద్దరు మంత్రులు

చింతకాని: ఖమ్మం జిల్లాలో ఈనెల 30వ తేదీన నిర్వహించనున్న ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రెవెన్యూ, వ్యవసాయ శాఖల మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు పరిశీలించారు. జిల్లాలోని చింతకాని మండలం జగన్నాధపురంలో నిర్వహించనున్న ‘రైతు ఆశీర్వాద సభ’ ఏర్పాట్ల తీరు తెన్నులను మంత్రులిద్దరూ వేర్వేరుగా పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్‌, వాహనాల పార్కింగ్‌ స్థలాలను మంత్రి పొంగులేటి పరిశీలించి వాతావరణ మార్పులను తట్టుకునేలా జర్మన్‌ హ్యాంగర్లతో అద్భుతమైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

సభా స్థలిని పొంగులేటి సందర్శించిన సందర్భంగా ఆయన వెంట కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, మట్టా రాగమయి దయానంద్, రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, తోట దేవీ ప్రసన్న, వ్యవసాయ శాఖ కార్యదర్శి కే. సురేంద్ర మోహన్ తదితరులు ఉన్నారు.

అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సీఎం సభా ఏర్పాట్లను పరిశీలించారు. రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ తెలపటంతో ఈ ఆశీర్వాద సభకు వచ్చే రైతులుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి పార్కింగ్ ఇతర సౌకర్యాలపై మంత్రి తుమ్మల అధికారులు నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. తుమ్మల వెంట వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు.

Popular Articles