పాలేరు: ఖమ్మం జిల్లా పాలేరు పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలుపు బీఆర్ఎస్ పార్టీదేనని, కేసీఆర్ మరోసారి సీఎం కావడం ఖాయమన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులపైనా కేటీఆర్ తనదైన శైలిలో ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలకు ‘ఎస్ఐఆర్’పై వెంకటగిరిలోని ఓ ఫంక్షన్ హాలుగో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కేటీఆర్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
- రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఆగిపోయి అనేక అరాచకాలు జరుగుతున్నాయి.
- రేవంత్ రెడ్డి హిట్లర్ నాకు ఆదర్శం అంటున్నాడు.
- వెలుగుమట్లలో రాక్షసుడిలాగా అర్ధరాత్రి వెయ్యి ఇళ్ళు కూలగొట్టాడు.
- పేదలు రోడ్డున పడితే ముఖ్యమంత్రికి పైశాచిక ఆనందంగా అనిపిస్తుంది.
- ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు దండుపాళ్యం నాయకులు.
- తెలంగాణ రాష్ట్రం ముష్కరుల పాలనలో ఇబ్బందుల పాలైంది.
- రెవెన్యూ మంత్రి అవినీతి సామ్రాజ్యం పెరిగిపోతోంది.
- రాష్ట్రంలో యూరియా లేదు, కరెంటు లేదు, రైతుబంధు లేదు, ధాన్యం కొనే దిక్కులేదు.
- వ్యవసాయ శాఖ మంత్రి అక్రమాలు రోజుకొక్కటి బయటకు వస్తున్నాయి.
- ఖమ్మంలో ఉన్నది ముగ్గురు మొనగాళ్ళు కాదు, ముగ్గురు మోసగాళ్ళు.
- కాంగ్రెస్ మళ్ళీ గెలవదని ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు.
- ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం ఆదాయం, కమిషన్ల దందాలు జోరుగా జరుగుతున్నాయి.
- పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమాలు పాలేరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ తెలియాలి.
- పొంగులేటి శ్రీనివాసరెడ్డి మోదీ కాళ్ళు పట్టుకున్నాడు, అందుకే ఈడీ దాడులపై కేసులు పెట్టలేదు.
- కోటి ఎకరాల భూములు 22A కింద పెట్టారు.
- రేవంత్ రెడ్డి ఘరానా దొంగ అయితే శ్రీనివాసరెడ్డి గజదొంగ.
- రెండున్నర సంవత్సరాల్లో శ్రీనివాసరెడ్డి చేసిందేమీ లేదు.
- ఎమ్మెల్యేలు, మంత్రులపై పొంగులేటి అహంకారం ప్రదర్శిస్తున్నాడు.
- అధికారం అడ్డం పెట్టుకుని వట్టినాగులపల్లిలో రైతులపై దాడులు చేసిండు.
- పాలేరులో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన గులాబీ జెండా ఎగురుతుంది.
- 20 లక్షల ఇళ్లు కడితేనే ఓటు అడుగుతా అన్నావ్.. మాట మీద నిలబడే దమ్ము ఉందా పొంగులేటి శ్రీనివాసరెడ్డీ?
- ఎలక్షన్ల ముందు ఎస్సీ, ఎస్టీల ఇండ్లకు ఆరు లక్షల రూపాయలు ఇస్తామన్నారు.
- విధ్వంసం తప్ప వికాసం తెలియదు కాంగ్రెస్ నాయకులకు.
- ఇవ్వాళ రైతుబంధు రావడం లేదు.
- దేవుని మీద ఒట్టేసి రుణమాఫీ ఎగ్గొట్టారు.
- యూరియా దుకాణం ముందు రైతులు నిలబడే పరిస్థితి తీసుకొచ్చారు.
- కేసీఆర్ రద్దు చేసిన భూమి శిస్తూ మళ్లీ పెడతా అంటున్నారు.
- ఆరు గ్యారెంటీ కార్డులు ఏమైయ్యాయి భట్టి విక్రమార్క?
- కేసీఆర్ అప్పుల పాలు చేశాడని మాట్లాడుతున్నారు.
- లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టాడు, సీతారామ ప్రాజెక్టు 80 శాతం పూర్తి చేశాడు కేసీఆర్.
- ఖమ్మంలో రెండు నర్సింగ్ కాలేజ్, రెండు మెడికల్ కాలేజ్ కట్టిచింది కేసీఆర్.
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండున్నర లక్షల కోట్ల అప్పు చేశారు.
- 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ఎందుకు హామీ ఇచ్చారు?
- వానపాము కూడా నాగుపాములా బుసలు కొడుతోంది.
- మళ్లీ గెలిచేది కేసీఆర్.
- ములుగు జిల్లాలో 12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక దోపిడీకి శ్రీకారం చుట్టాడు పొంగులేటి.
- బూత్ ల వారీగా బలమైన కమిటీ నిర్మాణం జరగాలి.
- మన దేశంలోనే మహిళలకు మొట్ట మొదటి ఎన్నికల్లో ఓటు హక్కు వచ్చింది.
- ఓటర్ లిస్టు వడపోత కార్యక్రమం జరుగుతోంది.
- ఎస్ఐఆర్ ను పట్టించుకోకపోతే తీవ్రంగా నష్ట పోతాం.
- రాష్ట్రంలో 3.39 కోట్ల మంది ఓటర్లు, 35,985 పోలింగ్ బూత్ లు ఉన్నాయి.
- ప్రతి పోలింగ్ బూత్ కు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక బీఎల్ఏను ఏర్పాటు చేసుకోవాలి..
- అర్హులైన వారి ఒక్క ఓటు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీఎల్ఏలది.
- పాలేరు నియోజకవర్గంలో అనుమానాస్పదంగా 10 వేల ఓట్లు ఉన్నాయి.
- గెలుపుకు, ఓటమికి ఒక్క ఓటు తేడా ఉంటుంది, అందరూ జాగ్రత్తగా చూసుకుని పనిచేయాలి.
- ఎంత పెద్ద నాయకుడైనా సొంత బూత్ లో మెజారిటీ తీసుకొచ్చి చూపెట్టండి.
- ఇప్పుడు కరెక్టుగా పని చేస్తేనే రేపు మంచి రోజులు వస్తాయి.
- డిజిటల్ యాప్ లోనే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు జరుగుతుంది.
- ప్రతి ఒక్కరికీ పార్టీ గుర్తింపు కార్డు ఇస్తాం.
- పటిష్టమైన కమిటీ నిర్మాణం జరిగితేనే భవిష్యత్తు బాగుంటుంది.. అని కేటీఆర్ అన్నారు.

