Top 5 This Week

Related Posts

మంత్రి కేటీఆర్ ఇలాఖాలో పారిశుధ్య కార్మికుల నిరసన

మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో పారిశుధ్య కార్మికులు సోమవారం నిరసనకు దిగారు. వేములవాడ పురపాలక సంఘంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు గత రెండు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో పారిశుధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. తమకు వేతనాలు వెంటనే చెల్లించాలని ఈ ఉదయం మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ఫొటో: వేములవాడ మున్సిపల్ ఆఫీసు ముందు పారిశుధ్య కార్మికుల నిరసన దృశ్యం

Popular Articles