హైదరాబాద్: దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా కర్నాటక సీఎంగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్ నిలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా.. అంటే 2023లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో శివకుమార్ తన స్థిర, చరాస్తుల విలువను రూ. 1,413 కోట్లుగా ప్రకటించారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల సీఎంల ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఓ నివేదికను రూపొందించింది. ఆ నివేదిక పేర్కొన్న గణాంక వివరాల ప్రకారం కర్నాటక సీఎం డీకే శివకుమార్ దేశంలోని సంపన్న ముఖ్యమంత్రుల్లో ప్రథమ స్థానంలో ఉన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 931.00 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో నిలవగా, రూ. 648 కోట్ల స్థిర, చరాస్తులతో తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ మూడో స్థానంలో నిలిచారు. నాలుగో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రూ. 332 కోట్ల ఆస్తులతో నాలుగో స్థానంలో ఉన్నారు. ధనిక సీఎంల జాబితాలో ఆయా ముగ్గురు నాయకులు దక్షిణాది రాష్ట్రాలకే చెందినవారు కావడం గమనార్హం.

