హైదారాబాద్: ఉద్యోగుల బదిలీలపై, పోస్టింగులపై తెలంగాణా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్రంలో మళ్లీ ఉద్యోగుల బదిలీలు, పోస్టింగులపై నిషేధం విధిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ఉత్తర్వు నెం. 57ను విడుదల చేశారు. ఉత్తర్వులో పేర్కొన్న కొన్ని సందర్భాల్లో మినహా ఈనెల 1వ తేదీ నుంచి అన్ని బదిలీలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఉత్తర్వు ప్రతిని దిగువన చూడవచ్చు.



