Top 5 This Week

Related Posts

విద్యా కమిషన్ ఛైర్మెన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా

హైదరాబాద్: తెలంగాణా విద్యా కమిషన్ ఛైర్మెన్ పదవికి మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి శుక్రవారం రాజీనామా చేశారు. ఈమేరకు చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావుకు తన రాజీనామా లేఖను పంపారు. తెలంగాణా విద్యా కమిషన్ ఛైర్మెన్ గా సేవలు అందించేందుకు తనకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని, తనకు అప్పగించిన టాస్క్ ను పూర్తి చేసి, సిఫారసులతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు చెప్పారు.

తన బాధ్యత పూర్తయినందున తాను సమర్పిస్తున్న రాజీనామాను ఆమోదించాల్సిందిగా ఆకునూరి మురళి తన లేఖలో కోరారు. ఆయన సమర్పించిన రాజీనామా లేఖ ప్రతిని దిగువన చూడవచ్చు.

Popular Articles