Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

ఇంద్రావతి అడవుల్లో ఎన్కౌంటర్, ఇద్దరు నక్సల్స్ మృతి

బీజాపూర్: ఛత్తీస్ గఢ్ లోని ఇంద్రావతి నది అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి చనిపోయిన నక్సలైట్ల మృత దేహాలతోపాటు ఒక్కొక్కటి చొప్పున ఎస్ఎల్ఆర్, ఇన్సాస్, .12 బోర్ రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్నపుడు నక్సల్స్ తారసపడడంతో జరిగిన కాల్పుల సందర్భంగా ఈ ఎన్కౌంటర్ ఘటన చోటు చేసుకున్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు.

కాగా ఘటన జరిగిన అటవీ ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ చెప్పారు. ఎన్కౌంటర్ గురించి మరిన్ని వివారలు తెలియాల్సి ఉందని, చనిపోయిన ఇద్దరు నక్సలైట్లను గుర్తించాల్సి ఉందన్నారు.

Popular Articles